వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో కలతలు రేపుతున్నాయి. అంతేకాదు మానవ సంబంధాలను కూడా మంటగలుస్తున్నాయి. ఒక్కసారి ఆ అక్రమ సంబంధాలకు అలవాటు పడితే దాని నుంచి బయటపడటం చాలా కష్టం. ఒకవేళ పిల్లల గురించి సమాజం గురించి ఆలోచించి బయటపడినా అవతలి వారు బయటపడనీయని పరిస్థితి. వారు పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు.
అయితే.. తాజాగా వనపర్తి జిల్లా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడి తో కలిసి భర్తను చంపింది భార్య. బాలస్వామి (38) అనే తన భర్తను గొంతు నులిమి చంపి హైదరాబాద్ బాలాపూర్ లో పూడ్చారు నిందితులు.
హత్యకు ముందు శాంతి పూజల డ్రామా ఆడి మరీ… అతన్ని హత్య చేశారు నిందితులు. అక్రమ సంబంధం తో పాటు, ఇటీవల పొలం అమ్మిన పైసలు 30 లక్షలు కాజేసేందుకు ప్రియుడు నవీన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో… భార్య లావణ్య , ఆమె ప్రియుడు నవీన్ తో పాటు సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పోలీసులు.