తెలంగాణలో దారుణం..కోడలి గొంతు కోసి చంపిన మామ

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత కోడలిని అతి కిరాతకంగా గొంతుకోసి మామ మార్చాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… మంచిర్యాల జిల్లాలోని లింగన్నపేట గ్రామానికి చెందిన సౌందర్య, వినోద్ కుమార్ ఏడాది కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అనంతరం వారిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.

దీంతో మూడు నెలల క్రితం మద్యానికి బానిసైన వినోద్ కుమార్… పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సౌందర్య అనే గ్రామంలో నూతన పుట్టింట్లో ఉంటోంది. ఈ తరుణంలోనే తన కుమారుడి మరణానికి కోడలే కాలమని కక్ష పెంచుకున్న మామ తిరుపతి… అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సౌందర్య పై కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన సౌందర్య తండ్రి లక్ష్మయ్య కూడా గాయపరిచాడు ఆ మామ. ఈ ఘటనలో సౌందర్య అక్కడికక్కడే మృతి చెందగా… గాయపడిన లక్ష్మిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.