దేశంలో రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. మహిళలపై కొందరు మానవ మృగాలు లైంగిక దాడులకు పాల్పడున్నారు.. ఇలాంటి సంఘటనలు రోజుకు పదికిపైగానే వెలుగులోకి వస్తున్నాయి. అయితే, తాజాగా యువకుడిపై అమ్మాయిల లైంగిక దాడి చేశారు.
ఓ యువకుడిని కారులో వెళుతున్న కొందరు యువతులు అపహరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన పంజాబ్ జలంధర్లో జరిగింది. నలుగురు అమ్మాయిలు కారులో వచ్చి జలంధర్ – కపూర్తల ప్రాంతంలో తనను అడ్రస్ అడిగారని, తాను చెప్తుండగా అపహరించే శారీరక హింసకు పాల్పడ్డారని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బాధ్యత యువకుడు తెలిపాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి పోలీస్ కేసు నమోదు కాలేదు.