ఇన్ స్టాలో ప్రేమవివాహం.. అనుమానంతో 7 నెలల గర్భిణీ దారుణ హత్య

-

ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఆ తర్వాత తన భార్య ప్రెగ్నెంట్ కావడం, పుట్టిన బిడ్డ మరణించడంతో వీరి మధ్య గొడవలు తలెత్తాయి. ఆ తర్వాత భార్య మీద అనుమానం పెంచుకుని ముఖంపై దిండు పెట్టి హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని నాగార్జున కాలనీలో వెలుగుచూసింది.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ – కుషాయిగూడలోని నాగార్జున నగర్‌లో కాచిగూడ రాజ్మాహల్లాకు చెందిన సచిన్ సత్యనారాయణ(21)కు కాప్రాకు చెందిన ఠాకూర్ స్నేహ(21)తో 2021లో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో 2022లో వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన బాబు అనారోగ్యంతో చనిపోగా ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి.

దీంతో కొన్నాళ్లపాటు ఇద్దరూ దూరంగా ఉన్నారు.ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసే సత్యనారాయణ నెల రోజుల క్రితం భార్యతో మళ్లీ రాజీ కుదుర్చుకుని నాగార్జుననగర్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. కొద్ది రోజుల తర్వాత భార్య ఏడు నెలల గర్భవతి అని తేలడంతో సత్యనారాయణకు ఆమెపై అనుమానం ఏర్పడింది.ఇన్నాళ్లు దూరంగా ఉన్న భార్య ఏడు నెలల గర్భిణీ ఎలా అయిందని అనుమానంతో మళ్లీ గొడవలు మొదలయ్యాయి.ఈ నెల 16న తెల్లవారు జామున స్నేహతో గొడవపడ్డ సత్యనారాయణ ఆమె కడుపుపై కూర్చొని తలదిండుతో ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.

దీంతో కడుపులో ఉన్న ఏడునెలల పిండం కూడా బయటపడింది.అనంతరం ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇంటి నుంచి పారిపోయాడు.ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.సత్యనారాయణపై అనుమానంతో గాలింపు చేపట్టి ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేపట్టగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version