హైదరాబాద్ వాసులను భయపెట్టిన కారు ప్రమాదం…!

-

హైదరాబాద్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ పార్కు వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ వంతెనపై వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపు తప్పి ఫ్లైఒవర్ మీద నుంచి కిందపడింది… ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికీ తీవ్రంగా గాయాలు అయ్యాయి. రహదారిపై ఒక మహిళ ఆటో కోసం ఎదురు చూస్తుండగా… వంతెన మీద నుంచి కారు కిందకు పడింది. కారు ఆమె మీద పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది… మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం,

ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని కేర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విశ్లేషించారు. కారు మితిమీరిన వేగంతో ఉండటంతోనే కంట్రోల్ అవ్వలేదని అందుకే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే వంతెనపై ఇటీవల ఒక ప్రమాదం జరిగింది. సెల్ఫి దిగుతున్న ఇద్దరు యువకులను కారు డీ కొట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ  ఫ్లైఓవర్‌ వంతెన ప్రారంభించిన నెల రోజుల్లోనే రెండు ప్రమాదాలు జరిగాయి. ఇక ఈ ఘటనకు అతి వేగమే కారణమని అంటున్నారు. అక్కడి స్థానికులు కూడా ఈ ప్రమాదం చూసి భయపడిపోయారు. ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. అసలు ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏంటి అనే దానిపై అక్కడి స్థానిక పోలీసులను కూడా ఆరా తీస్తున్నారు. ఏది ఎలా ఉన్నా కారు ప్రమాదం మాత్రం ఇప్పుడు ఫ్లై ఓవర్ మీద వెళ్తున్న వాళ్ళను ఆందోళనకు గురి చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news