రేప్ చేసినోడిని ఉరితీయాలంటూ పోస్ట్ పెట్టి.. త‌నే రేప్ చేసి అడ్డంగా దొరికిపోయాడు..!

-

చెప్పేవి శ్రీరంగనీతులు.. దూరేవి దొమ్మరి గుడిసెలు.. అన్నట్టుగా ఉంది ఈ ప్రబుద్ధుడి వ్యవహారం. ఆ అత్యాచార నిందితుడిని చంపేయాల్సిందే నిజమే. మరి.. శ్రీరంగనీతులు చెప్పి.. ఇలాంటి పనులు చేసేవాళ్లను ఏం చేయాలి?

ఇది వర్చువల్ యుగం కదా. మనమంతా ఎక్కువగా సోషల్ మీడియాలోనే గడుపుతాం. సోషల్ మీడియాలో శుద్ధపలుకులు పలుకుతాం. అది.. ఇది అని తెగ రియాక్ట్ అవుతాం. మనంత శుద్ధపూసలు ఇంకెవరూ ఉండరు అని గప్పాలు కొడుతాం. ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే చాలు.. ఉవ్వెత్తున లేస్తాం. కానీ.. ఆ తప్పు మనం చేస్తున్నామా? లేదా? అని ఆలోచించం. ఎదుటి వాడు చేస్తేనే అది తప్పు. మనం చేస్తే కాదు.. అన్నట్టుగా ఉంటుంది కొందరి ప్రవర్తన.

ఒంగోలులో 16 ఏళ్ల అమ్మాయిపై కొందరు యువకులు అత్యాచారం చేశారు కదా. ఆ ఘటన నిందితులను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. తన ఫ్రెండ్‌ను కలవడానికి ఒంగోలు వచ్చిన అమ్మాయికి మాయమాటలు చెప్పి షేక్ బాజీ అనే వ్యక్తి తన రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరో వ్యక్తి కూడా ఆ అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత అమ్మాయిని మరో రూమ్‌కు తీసుకెళ్లి.. మరో నలుగురితో కలిసి వీళ్లిద్దరు.. మొత్తం ఆరుగురు గత కొన్ని రోజులుగా ఆ అమ్మాయిపై పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ మృగాళ్ల బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న అమ్మాయి.. తనకు జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు చెప్పడం.. వెంటనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లను విచారిస్తున్నారు.

అయితే.. ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన వాళ్లలో ప్రధాన నిందితుడు షేక్ బాజీ తన ఫేస్‌బుక్‌లో తానెంతో నీతిమంతుడిని అన్నట్టుగా పోస్టు పెట్టాడు. ఇటీవల వరంగల్‌లోని హన్మకొండలో 9 నెలల చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటన నిందితుడి గురించే మనోడు పోస్టు పెట్టింది.

ఎందుకు అన్న ఇలాంటి వాడిని జైల్‌లో పెట్టి పోషిస్తున్నారు. ఇలాగే మీ వాళ్లలో ఎవరికైనా జరిగితే కోపం రాదా అన్న. చంపాలన్న కోపం వచ్చింది. అందుకే అన్న వాడిని చంపేయండి అన్న బాధగా ఉంది ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.. అంటూ మనోడు ఏడుస్తున్న ఎమోజీలను కూడా పెట్టి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

చెప్పేవి శ్రీరంగనీతులు.. దూరేవి దొమ్మరి గుడిసెలు.. అన్నట్టుగా ఉంది ఈ ప్రబుద్ధుడి వ్యవహారం. ఆ అత్యాచార నిందితుడిని చంపేయాల్సిందే నిజమే. మరి.. శ్రీరంగనీతులు చెప్పి.. ఇలాంటి పనులు చేసేవాళ్లను ఏం చేయాలి?

Read more RELATED
Recommended to you

Latest news