పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ హత్యాకాండలో 21 మందిపై కేసులు నమోదు చేసిన సీబీఐ

-

పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ అల్లర్లు, హత్యాకాండపై సీబీఐ విచారణ చేపట్టింది. బీర్భూమ్ జిల్లాలోని బొగ్తుయ్ గ్రామంలో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాల కారణంగో ఓ గ్రూప్ మరో గ్రూప్ ఇళ్లపై దాడి చేసింది. మార్చి 21న జరిగిన ఈ ఘటనలో 10 ఇళ్లకు నిప్పు పెట్టారు. మహిళలు మరియు పిల్లలతో సహా ఎనిమిది మందిని చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలన కలిగించింది. దీనిపై ప్రస్తుతం కలకత్తా హైకోర్ట్ సీబీఐ విచారణకు ఆదేశించింది. ఎప్రిల్ 4 వరకు నివేదిక సమర్పించాలని కోరింది. 

తాజాగా శనివారం బీర్భూమ్ హింసాకాండకు సంబంధించి విచారణ జరిపేందుకు డీఐజీ అఖిలేష్ సింగ్ నేతృత్వంలోని సీబీఐ టీం, ఫోరెన్సిక్ టీం రామ్ పూర్ హాట్ గ్రామాన్ని సందర్శించింది. 15 సభ్యులతో కూడిన సీబీఐ టీమ్ ఈ హత్యాకాండను విచారిస్తోంది. సీబీఐలో జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్నారు. బీర్భూమ్ అల్లర్లకు సంబంధించి సాయుధ అల్లర్లకు సంబంధించిన నేరంపై సెక్షన్ 147,148,149 కింద 21 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news