తెలంగాణలో దారుణం..చెల్లెలిపై 6 నెలలుగా అన్న అత్యాచారం

-

దేశంలో మహిళలపై లైంగిక దాడులు ఏ మాత్రం ఆగడం లేదు. అయితే.. ములుగులో జిల్లాలో సొంత చెల్లెలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అన్న. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. కన్నాయి గూడెం మండలం వాసంపల్లి లో చంటి అనే యువకుడికి పెళ్లి అయి.. భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ కామాంధుడి కళ్లు తన సొంత చిన్నాన్న కూతురిపై పడ్డాయి.

పుష్పాలంకరణ శుభకార్యం నాటి నుంచి నువ్వంటే నాకిష్టమంటూ ఆ బాలికను బెదిరించి.. తన కామవాంఛను తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడని.. తన తల్లిదండ్రులనూ హతమారుస్తానని.. ఇల్లు తగల పెడతానని భయపెట్టినట్లు బాలిక తెలిపింది. మూడు రోజుల కిందట… ఆ బాలికకు కడుపునొప్పి రావడంతో.. తల్లి దండ్రులు వైద్య పరీక్షలు చేయించారు. ఈ నేపథ్యంలోనే.. గర్భం దాల్చినట్లు తేలింది. దీంతో తల్లి దండ్రులు అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అతనిపై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news