నాగపూర్ జిల్లాలోని సావనేర్ నగరంలో 25 ఏళ్ల అజయ్ అనే యువకుడు నర్సుగా పనిచేసే 21 ఏళ్ల యువతతో మూడేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే ఆదివారం ప్రియురాలితో కలిసి లాడ్జికి వెళ్ళాడు అజయ్. ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఓ రూమ్ తీసుకున్నాడు. ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనాలన్న ఉద్దేశంతో శృంగార సామర్థ్యాన్ని పెంచే ట్యాబ్లెట్లు వేసుకున్నాడు.
అయితే ఏమైందో ఏమో తెలియదు, ప్రియురాలితో శృంగారం చేస్తుండగా ఒక్కసారిగా అజయ్ స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ప్రియురాలు విషయాన్ని లాడ్జి సిబ్బందికి, అతని స్నేహితులకు ఫోన్ చేసి చెప్పింది. దీనితో వెంటనే రూమ్ కి వచ్చి అజయ్ ని హాస్పిటల్ కు తరలించారు లాడ్జి సిబ్బంది. అయితే అజయ్ ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయినట్లు కన్ఫర్మ్ చేశారు.
మృతుడు జేబులో శృంగార సామర్థ్యాన్ని పెంచే సంబంధిత మాత్రలు దొరికాయని పోలీసులు తెలిపారు. ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనాలన్న ఉద్దేశంతో ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల కలిగిన సైడ్ ఎఫెక్ట్ ల కారణంగానే అతడు మృతి చెందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఇది హత్య? లేదా ట్యాబ్లెట్ల వల్లనేనా లేక ఇంకేమైనా కారణం వల్ల చనిపోయాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.