రహానేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ధోనీ

-

గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో రహానే ఆటతీరు ఏమంత మెరుగ్గా లేకపోవడంతో, అన్ని ఫార్మాట్లలో అతడి ఆట ముగిసినట్టేనని అందరూ భావించారు. ఇంతలోనే తమ అభిప్రాయం తప్పు అని నిరూపించారు రహానే. ఐపీఎల్ లో ఇప్పుడు అందరి దృష్టి అజింక్యా రహానేపై ఉందంటే అతిశయోక్తి కాదు. గతంలో అనేక సీజన్లు ఐపీఎల్ లో ఆడినా రాని గుర్తింపు… ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడడం ద్వారా లభించింది. 34 ఏళ్ల వయసులో రహానే ఆడుతున్న స్ట్రోక్ ప్లే ఔరా అనిపిస్తోంది. టీమిండియాకు ఆడే అవకాశాలు ఇక లేవని అందరూ అనుకున్నారు. రహానే ఈ ఐపీఎల్ 16వ సీజన్ లో విధ్వంసక బ్యాటింగ్ తో ప్రత్యర్థి జట్ల బౌలింగ్ దాడులను తుత్తునియలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో, రహానే తాజా ఫామ్ పై సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. తాము రహానేకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని వెల్లడించాడు. “ఏ ఆటగాడిలో అయినా సత్తా ఉందని మేం భావిస్తే… అతడు ఎలా ఆడాలనుకుంటే అలా ఆడేందుకు స్వేచ్ఛగా వదిలేస్తాం. రహానే విషయంలోనూ అంతే.

IPL 2023: MS Dhoni reveals his pep talk with Ajinkya Rahane after CSK's  dominating win over MI | CricketTimes.com

అతడు సరైన స్థానంలో దిగేలా చూశాం. ఒకప్పుడు గొప్ప ఇన్నింగ్స్ లు ఆడిన రహానే ఓ దశలో ఫామ్ కోల్పోవడంతో ఎవరూ అతడిని పట్టించుకోలేదు. టీమిండియా కూడా దాదాపుగా అతడిని వదిలేసింది. గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో రహానే ఆటతీరు ఏమంత మెరుగ్గా లేకపోవడంతో, అన్ని ఫార్మాట్లలో అతడి ఆట ముగిసినట్టేనని అందరూ భావించారు. వేలంలో కొన్ని ఐపీఎల్ జట్లయితే అతడి పేరును కూడా పరిశీలించడానికి ఆసక్తి చూపలేదు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం రహానేపై నమ్మకం ఉంచింది. అతడిని కనీస ధర రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ పై కేవలం 29 బంతుల్లోనే 71 పరుగులు చేసి తనలో పరుగుల దాహం ఇంకా తీరలేదని చాటిచెప్పాడు. ఈ మ్యాచ్ లో ఎంతో కసిగా ఆడిన రహానే 6 ఫోర్లు, 5 సిక్సులు బాదాడు. అవతలి వైపు క్రీజులో ఉన్న యువ ఆటగాడు శివమ్ దూబే సైతం ఆశ్చర్యపోయేలా రహానే మెరుపుదాడి కొనసాగింది.

 

Read more RELATED
Recommended to you

Latest news