ప్రాణం విలువ పోయే వరకూ తెలియదు..అందరూ లైఫ్ అంటే ఇలా ఉండాలి, బాగా చదవాలి, ఎదగాలి, అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి, పెళ్లి, పిల్లలు..ఇలా చాలానే ఆలోచిస్తారు.. పదేళ్ల తర్వాత ఏం చేయాలి ఎలా ఉండాలో కూడా ఇప్పుడే అనుకుంటారు.. కానీ ఒక ప్రాక్టికల్ విషయం ఏంటంటే.. అసలు నువ్వు రేపటి వరకూ బతికి ఉంటావో లేదో కూడా తెలియదు..కానీ ఇంత ముందు ఆలోచన.. నెక్ట్స్ అరగంటలో ఏం జరగబోతుందో కూడా మనం కరెక్టుగా ఊహంచలేం.. మనతో ఉన్నది ఏదీ శాశ్వతం కాదు..ఏదైనా..ఏదైనా..జరగొచ్చు లైఫ్‌లో కొన్ని మరణాలు చూసినప్పుడు భయమేస్తుంది. అంటే అవేం ఘోరంగా మర్డర్ చేసినవి కాదు.. చాలా సింపుల్‌గా జరిగిపోయినవి. స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తూ, ఫ్రెండ్స్‌తో నవ్వుతూ మాట్లాడుతూ, జిమ్‌లో వర్కౌట్ చేస్తూ..ఇలా చేస్తూనే సడన్‌గా కుప్పకూలి చనిపోతారు. అలాంటిదీ ఈ ఘటన కూడా..! మధ్యప్రదేశ్ ఇండోర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జిమ్‌లో ఓ హోటల్ యజమాని గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడి పేరు ప్రదీప్ రఘువంశీ (55). బృందావన్ హోటల్ యజమాని. ఆయనకు జిమ్‌కు వెళ్లే అలవాటు ఉంది.
ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య ఈమధ్యకాలంలో బాగా పెరిగింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఏజ్‌తో సంబంధమే లేదు.. సడెన్‌గా హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. మూడు పదుల వయసు కూడా దాటని వారు, చివరికి యంగర్స్ సైతం గుండెపోటుతో చనిపోతున్నారంటే..మనం ఏం తప్పు చేస్తున్నాం. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన ఘటన చూస్తే.. వ్యాయామం చేయడం కూడా తప్పనే అనిపిస్తుంది. జిమ్‌జమాని గుంలో ఓ హోటల్ యడెపోటుతో మృతిచెందాడు. మృతుడి పేరు ప్రదీప్ రఘువంశీ (55). బృందావన్ హోటల్ యజమాని. ఎప్పటిలాగే గురువారం కూడా జిమ్‌కు వెళ్లాడు. ట్రెడ్‌మిల్‌పై నడిచాడు. తర్వాత అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.
అంతే.., ఉన్నట్టుండి నేల మీద కుప్పకూలాడు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న కొందరు యువకులు వెంటనే ప్రదీప్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ నెల 18న ప్రదీప్ కొడుకు పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాదం జరగడంతో కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ట్రెడ్ మెల్‌పై నడిచాక ప్రదీప్‌కు చెమట్లు పట్టాయి. తన జాకెట్ తీసుకుని తుడుచుకున్నాడు. ఇంతలో అతడికి తల తిరిగినట్లు అనిపించింది. సపోర్ట్ కోసం పక్కనే ఉన్న టేబుల్‌ని పట్టుకోబోయాడు. అంతలోనే కుప్పకూలాడు.
ఇదంతా జిమ్‌లో ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. డైలీ వ్యాయమం చేస్తే ఏ రోగాలు రావంటారు..మరీ జిమ్ చేసేవాళ్లు కూడా ఇలా గుండెపోటుకు బానిసలవుతుంటే..ఏం చేయాలి.!