వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై కత్తితో దాడి..

-

విశాఖపట్టణం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై దాడి జరిగింది. ఆయనపై హత్యాయత్నం జరిగింది. విశాఖపట్టణం విమానాశ్రయం లాంజ్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. లాంజ్‌లో జగన్ ఉండగా.. ఆయనపై ఓ దుండగుడు ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. సెల్ఫీ కోసం వచ్చిన ఆ దుండగుడు తన దగ్గర ఉన్న చిన్న కత్తితో జగన్‌పై దాడి చేశాడు. ఆ కత్తి కోడి పందెలకు ఉపయోగించేదిలా ఉంది. దీంతో జగన్ భుజానికి గాయాలయ్యాయి. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయి దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడు ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version