ప్రియుడితో పారిపోతూ పట్టుబడిన ఇల్లాలు.. గ్రామ‌పెద్ద‌లు సంచ‌ల‌న తీర్పు..

-

ఓ ఇల్లాలి వివాహేతర సంబంధం గట్టురట్టయింది. ఒడిశాలోని సుందర్ గడ్ జిల్లా మడియాకుదర్ గ్రామానికి చెందిన యువతికి ముండాఝోరొ గ్రామానికి చెందిన యువతితో మేలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఆమెకు చిరుబెడా గ్రామానికి చెందిన పురాణ్ సింగ్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉంది. వివాహం తరువాత భర్తతో కాపురం చేస్తూనే ప్రియుడినీ ఆమె కలుస్తుండేది. ఈ విషయాన్ని పసిగట్టిన భర్త, పలుమార్లు ఆమెతో గొడవపడ్డాడు.

ఈ క్రమంలో ఇక ప్రియుడితో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆమె, బస్టాండ్ లో గ్రామస్తులకు పట్టుబడింది. ఇద్దరినీ తాళ్లతో కట్టేసిన గ్రామస్తులు, పురాణ్ సింగ్ కుటుంబ సభ్యులను పిలిపించారు. ఆపై గ్రామ పెద్దలు విచారణ జరిపారు. వారిద్దరూ కలిసివుంటామనే చెప్పడంతో, పెళ్లి నిమిత్తం ఖర్చు పెట్టిన రూ. 1.50 లక్షలు వెనక్కు ఇచ్చేసి వెళ్లిపోవచ్చని చెప్పారు. అయితే దీనికి అంగీకరించిన పురాణ్ సింగ్, రూ. 50 వేలు ఇచ్చి, మిగతా డబ్బు త్వరలోనే ఇస్తానని చెప్పి, ప్రియురాలిని తీసుకుని వెళ్లాడు. ఇక, ఈ మొత్తం వ్యవహారాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరించిన కొందరు సోషల్ మీడియాలో పెట్టగా, అది వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news