దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై సర్వే.. తెలుగు రాష్ట్రాలే టాప్

-

దేశంలో ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డులు, ఈ కేవైసీ, ఆన్లైన్ ఆర్డర్, లక్కీ డిప్ పేరుతో మోసాలకు ఇలా అనేక మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారు. ఆన్లైన్ ట్రాన్జక్షన్స్ పెరిగిన నేపథ్యంలో మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ” లోకల్ సర్కిల్” అనే సంస్థ నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దేశంలో 42 శాతం మంది ప్రజలు సైబర్ నేరగాల్ల బారిన పడ్డ వారేనని తేలింది.

దేశవ్యాప్తంగా ప్రతి నెల 80 వేల కేసులు నమోదవుతున్నాయి. దాదాపు ప్రతినెల 200 కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువగా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు ప్రజలు. తెలంగాణలో సగటున 9 కేసులు నమోదు అవుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 5వేల కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసినా సైబర్ నేరగాళ్లు మాత్రం రూటు మారుస్తున్నారు. కొత్త తరహాలో మోసాలు చేస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి ఈ నేరాలకుుతున్నారు సైబర్ నేరగాళ్లు.

Read more RELATED
Recommended to you

Latest news