నగ్న వీడియోలు తీసి, భర్తపై భార్య దారుణం

వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో కలతలు రేపుతున్నాయి. అంతేకాదు మానవ సంబంధాలను కూడా మంటగలుస్తున్నాయి. ఒక్కసారి ఆ అక్రమ సంబంధాలకు అలవాటు పడితే దాని నుంచి బయటపడటం చాలా కష్టం. ఒకవేళ పిల్లల గురించి సమాజం గురించి ఆలోచించి బయటపడినా అవతలి వారు బయటపడనీయని పరిస్థితి.

వారు పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు. అయితే తాజాగా ఢిల్లీలోని లక్ష్మీ నగర్ కు చెందిన ఓ నగల వ్యాపారి భార్య తన భర్త ఫ్రెండ్ తో ఎఫైర్ పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇంట్లో ఉన్న నగలు, నగదు తీసుకొని ప్రియుడితో పారిపోయింది. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తాను సీక్రెట్ కెమెరాలు పెట్టి అత్తమామల నగ్న వీడియోలు తీశానని, వాటిని వైరల్ చేస్తానని ఆ మహిళ భర్తను బెదిరించింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.