బ్రహ్మోస్ క్షిపణి రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేసిన పాక్ స్పై, డీఆర్డీవో శాస్త్రవేత్త నిషాంత్ అగర్వాల్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. యూపీ, మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో భాగంగా నాగపూర్‌లోని బ్రహ్మోస్ సెంటర్లో అతడిని పట్టుకున్నారు. బ్రహ్మోస్ రహస్యాలను అతడు పాక్ చేరవేర్చాడని ఫేస్బుక్ చాట్ ద్వారా పోలీసులు గుర్తించారు. పాక్ ఆపరేటర్లతో అతడు ఫేస్బుక్ ద్వారా చాట్ చేయడం ఇంటిలిజింట్ వర్గాలకు తెలిసింది. దీంతో తీగ లాగితే డొంక కదిలింది. అయితే.. అతడు ఇదంతా కేవలం 17 లక్షల రూపాయల జాబ్ కోసం చేసినట్లు ఒప్పుకున్నాడు. కెనడాలో ఐటీ జాబ్ కోసం బ్రహ్మోస్ టెక్నికల్ సీక్రెట్స్ బయటపెట్టినట్లు తెలిపాడు. ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్ కావాలని కంపెనీ అడగడంతో బ్రహ్మోస్ సీక్రెట్స్‌ను నిషాంత్ వారికి చెప్పినట్లు అతడు పోలీసు విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
ఫేస్బుక్లో చాట్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్ స్పై నిషాంత్..
-