సిద్ధరామయ్యను సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను డిప్యూటీ సీఎం చేయడంతోపాటు ఆయనకు కీలక శాఖలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే మొదటి రెండేళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాత మూడేళ్లు డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నది. అలాగే సీఎం పదవి చేపట్టనున్న సిద్ధరామయ్యను డీకే శివకుమార్ అభినందించారు. ‘ఆయనకు (సిద్ధరామయ్యకు) అభినందనలు, గుడ్ లక్’ అని అన్నారు.
డీకే శివకుమార్ సంగతి అలా ఉంటే.. ఎమ్మెల్యేల మద్దతుతో తానే కాబోయే ముఖ్యమంత్రి అని సిద్ధరామయ్య ప్రకటించుకున్నారు. డీకే శివకుమార్ మాత్రం.. అలా చెప్పలేదు. అవసరమైతే ముఖ్యమంత్రిని చేయండి.. లేకుంటే మంత్రి పదవి వద్దు.. ఎమ్మెల్యేగానే ఉంటానని డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. కేంద్ర పరిశీలకులు కూడా తమ నివేదికను సిద్ధరామయ్యకు సమర్పించారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించవచ్చని తెలుస్తున్నది.