దళితబంధు…ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న పథకం. హుజూరాబాద్ ఉపఎన్నికని దృష్టిలో పెట్టుకుని, అక్కడున్న దళిత ఓటర్లని ఆకర్షించడానికి కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారు. కేవలం రాజకీయం కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు కేసీఆర్ కూడా చెబుతున్నారు. మొదట ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌లోనే అమలు చేయనున్నారు.
ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే ఈ పథకం ద్వారా చాలావరకు టీఆర్ఎస్‌కు లబ్ది చేకూరుతుందని తెలుస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓట్లు కూడా బాగానే పడతాయి. మరి ఈ పథకం వల్ల కేసీఆర్‌కు ఇబ్బంది కూడా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది ఎలా అంటే ఇప్పటికే రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్‌పై వ్యతిరేకిత మొదలవుతున్నట్లు కనిపిస్తోంది.
ఉపఎన్నిక ఉందనే హుజూరాబాద్‌కు వేల కోట్లు పెట్టి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, కానీ రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలని పట్టించుకోవడం లేదని ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఇక తమ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేస్తే ఉపఎన్నికలు వస్తాయని, అప్పుడు వేల కోట్లు తమకు ఇస్తారని మాట్లాడుకుంటున్నారు.
అయితే ఇదే అంశం నెక్స్ట్ ఎన్నికల్లో కేసీఆర్‌కు నెగిటివ్ అయ్యేలా కనిపిస్తోంది. కేవలం రాజకీయం కోసం వేల కోట్లు పెడుతున్నారు. దీని వల్ల ఇతర నియోజకవర్గాల్లో వ్యతిరేకిత మొదలైంది. పైగా దళితబంధు పథకం వల్ల దళితులకు బెనిఫిట్ ఉంటుంది. మరి మిగిలిన కులాల పరిస్తితి ఏంటి? అని అడుగుతున్నారు.
అసలు దళిత బంధు రాష్ట్రం మొత్తం ఉన్న దళితులకు అమలు కాకపోయిన కేసీఆర్‌కే ఇబ్బంది. ఎందుకంటే ఆ పథకం ద్వారా చిన్న ఎమౌంట్ ఏమన్నా ఇస్తే ఇబ్బంది ఉండదు గానీ, కేసీఆర్ పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేలా కనిపిస్తున్నారు. దీంతో మిగిలిన కులాల వారికి కూడా ఆశ పుడుతుంది. దాని వల్ల కేసీఆర్ ప్రభుత్వానికే నెగిటివ్ అవుతుంది. కాబట్టి దళితబంధు వల్ల ఇప్పుడు బాగానే ఉన్నా రానున్న రోజుల్లో మాత్రం కేసీఆర్‌కు షాక్ కొట్టడం ఖాయమంటున్నారు.