మీ బండారం బయటపెట్టకపోతే మేము బట్టలు విప్పుకుంటాం : దాసోజు శ్రవణ్‌

-

ఓయూ ముట్టడి ఘటనలో అరెస్టైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌పై కాంగ్రెస్‌ నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్బంధ వాతావరణం ఉందని ఆయన ఆరోపించారు. జగ్గారెడ్డి అరెస్ట్ ను అప్రజాస్వామికమన్నారు. ప్రశ్నించే గొంతుకలు విశ్వవిద్యాలయాలని, గతంలో చాలా మంది నేతలు మీటింగ్ లు పెట్టారని, రాహుల్.. నిషేదిత సంస్థకు చెందిన నాయకుడు కాదు కదా.. మారేందుకు భయం శ్రవణ్‌ ప్రశ్నించారు.

KCR turned Telangana into corrupt State: AICC national spokesperson Dasoju  Sravan

రాహుల్ ఓయూకు వస్తే.. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని టీఆర్‌ఎస్‌ నేతల ఆందోళన అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ట్స్ కాలేజీ బయట కూర్చుంద్దాం రండీ.. మీ బండారం బయటపెట్టకపోతే మేము బట్టలు విప్పుకొని వస్తాం.. హరీష్ రావు, కేటీఆర్ లకు దమ్ముందా అంటూ దాసోజు శ్రవణ్‌ సవాల్‌ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news