దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసు నిందితుడు అరెస్ట్

మన దేశం లో మరో భారీ డేటా చోరీ జరిగింది. ఈ చోరీ దేశం లోనే పెద్ద సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా వ్యక్తిగత డేటా చౌర్యం కేసులో కీలక పురోగతి కనిపించింది. ఈరోజు నిందితుడు వినయ్ భరద్వాజ సైబరాబాద్ పోలీసుల చేతికి చిక్కాడు. తన దగ్గర నుంచడి 2 ల్యాప్ టాప్ లు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా, వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది వివరాలు ఉన్నట్టు తెలిపారు పోలీసులు.

డేటా చోరీ కేసులో మరొకరి అరెస్ట్.. జీఎస్టీ, పాన్ కార్డు, అమెజాన్ నుంచి డేటా  చోరీ - Mana Telangana

విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగుల డేటాను ‘ఇన్ స్పైర్ వెబ్స్’ అనే వెబ్ సైట్ ద్వారా విక్రయించాడు వినయ్ భరద్వాజ. నిందితుడు జీఎస్టీ, పాన్ కార్డ్, యూట్యూబ్, ఫోన్ పే, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, అప్ స్టాక్స్, బిగ్ బాస్కెట్, ఇన్ స్టాగ్రామ్, వేదాంత, బుక్ మై షో, బైజూస్ నుంచి డేటా దొంగిలించాడు. 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటన్ నగరాలకు చెందినవారి డేటా చోరీ చేశాడు. కాగా, ఈ ముఠా ఏపీకి చెందిన 2.1 కోట్ల మంది నుంచి డేటా చోరీ చేసినట్టు సమాచారం. హైదరాబాద్ కు చెందిన 56 లక్షల మంది డేటా కూడా ఈ ముఠా వద్ద ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన 21.39 కోట్ల మంది డేటా చోరీ చేశాడు నిందితుడు.