సన్​రైజర్స్​ హైదరాబాద్ పై డేవిడ్ వార్నర్ సీరియస్ !

-

ఆసీస్‌ క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ కు ఐపీఎల్‌ 2021 లో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. కారణం కూడా చెప్పకుండా.. డేవిడ్‌ వార్నర్‌ ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ.. సన్‌రైజర్స్‌ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే… ఈ అంశం పై మరోసారి డేవిడ్‌ వార్నర్‌ సీరియస్‌ కామెంట్లు చేశాడు. బ్యాక్‌ స్టేజ్‌ విత్‌ బోరియా కార్యక్రమంలో భాగంగా సన్‌ రైజర్స్‌ యాజమాన్యం పై వార్నర్‌ ఫైర్‌ అయ్యారు.

” కెప్టెన్సీ నుంచి తప్పించి కనీసం జట్టులో కూడా అవకాశం కల్పించకుండా చేసి… యాజమాన్యం జట్టులోని ఇతర ఆటగాళ్ల కు ఇచ్చిన సందేశం ఏంటి.. యువ ఆటగాళ్లకు దీనిని ఎలా అర్థం చేసుకోవాలి. అన్నిటికన్నా.. బాధించే విషయం ఏమిటంటే.. ప్రస్తుతం జట్టులో ఉన్న వారు కూడా మా పరిస్థితి ఇలానే అవుతుందేమో? అని ఆలోచిస్తారు. ” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు డేవిడ్‌ వార్నర్‌. ఇక నైనా సన్‌ రైజర్స్‌ యాజమాన్యం తీరు మార్చు కోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version