కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే రుణ మాఫీ చేస్తాం: రేవంత్ రెడ్డి

-

సీఎం కేసీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అసైన్డ్ భూములు రైతుల నుండి లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల తరఫున కొట్లాడిన వారిపై కేసులు ఎత్తేస్తాం అన్నారు. రాజీవ్ గాంధీని చంపిన వారిని వదిలేయండి అని అడిగిన చరిత సోనియా గాంధీది అని అన్నారు రేవంత్ రెడ్డి. రాజద్రోహం కేసుల చట్టం రద్దు చేయాలన్నది మా విధానం అని అన్నారు. కెసిఆర్ సీఎం అయ్యాకే షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది అని విమర్శించారు.

షుగర్ ఫ్యాక్టరీ నడపలేని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎం నడిపిస్తారని విమర్శించారు. కెసిఆర్ అవసరం లేని వాటికి ఎక్కువగా అప్పులు చేసి.. ఆయనకు ఎందులో లాభం ఉందో అది చేసుకున్నాడని విమర్శించారు. రైతుల మొత్తం అప్పు 30 వేల కోట్ల వరకు ఉన్నాయని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తరువాత నాలుగేళ్లలో బ్యాంకులకి తిరిగి చెల్లించుకుంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news