BREAKING : నిరుద్యోగులకు కేంద్ర హోంశాఖ శుభవార్త చెప్పింది. కేంద్ర సాయుధ బలగాల నియామకాల పరీక్షలు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర హోంశాఖ. ఇంగ్లీష్ , హిందీ భాషలకు అదనంగా 13 ప్రాంతీయ భాషలలో పరీక్షలు నిర్వహించాలని తాజాగా కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.
దీంతో తెలుగు నిరుద్యోగులకు కూడా లబ్ది చేకూరనుంది. ఇక దీనిపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. CRPF పరీక్షను తెలుగుతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు అంగీకరించినందుకు అమిత్‌షా కి ధన్యవాదాలు చెప్పారు కేటీఆర్. ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ఆశావహులకు తప్పకుండా ఉపయోగ పడుతుందని కేటీఆర్ ట్వీట్… చేశారు.