జాబ్ పాలిటిక్స్: కేసీఆర్ కంటే జగన్ ముందే!

-

తెలంగాణ ఉద్యోగాలు ప్రకటిస్తే…ఏపీలో హడావిడి కనిపిస్తోంది…అసలు తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కసైగా 90 వేల పైనే ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయడానికి సిద్ధం కావడంతో..అక్కడ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటివరకు నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు…కానీ ఒక్కసారిగా ఉద్యోగాలని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో సంతోషం కనబడుతుంది…కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా నిరుద్యోగులు మారారు.

సరే ఇదంతా తెలంగాణకు సంబంధించింది..ఏపీతో సంబందం ఏముందని అనుకోవచ్చు…రెండు తెలుగు రాష్ట్రాలు..మొన్నటివరకు కలిసే ఉన్నాయి..కాబట్టి ఏం జరిగిన..పోలిక తప్పనిసరి వస్తుంది. తెలంగాణలో ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి..ఇప్పుడు ఏపీలో కూడా ఉద్యోగాల భర్తీపై డిమాండ్ పెరిగింది. జగన్ అధికారలోకి రాక ముందు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.

కానీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత జగన్..జాబ్ క్యాలెండర్ ప్రకటించారు..కానీ అందులో ఎక్కువ ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కేవలం వందల సంఖ్యలోనే ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..దీనిపై నిరుద్యోగుల్లో తిరుగుబాటు మొదలైంది. జాబ్ క్యాలెండర్ రద్దు చేసి..కొత్త క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ పెరిగింది…పైగా కేసీఆర్ 90 వేల పైనే ఉద్యోగాలని ప్రకటించడంతో…జగన్ పై ఒత్తిడి పెరిగింది. ఏపీలో కూడా లక్ష ఉద్యోగాలని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అటు ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు సైతం నిరుద్యోగుల కోసం పోరాడుతున్నారు.. కేసీఆర్‌ను చూసి నేర్చుకో…లేకపోతే నిరుద్యోగుల ఉసురు తగులుతుందని ఏపీ సీఎం జగన్‌ పై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక నిరుద్యోగులు సైతం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ నుంచి కొత్త వాదన వస్తుంది.

కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగాలు ప్రకటించారేమో…జగన్ రెండేళ్లలో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో అందరికీ తెలుసని, గ్రామ వాలంటీర్లుగా 2 లక్షలపైనే ఉద్యోగాలు, గ్రామ/వార్డు సచివాలయాలు ఉద్యోగాలు లక్షా 40 వేల వరకు ఇచ్చారని, ఇంకా పలు ఉద్యోగాలు భర్తీ చేశారని చెప్పుకొస్తున్నారు. అంటే కేసీఆర్ కంటే ముందు జగనే ఉద్యోగాలు ఇచ్చారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news