రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో 23 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి

-

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కి నేడు ఐపీఎల్ లో మరో పరాజయం ఎదురయ్యింది. ఈరోజుతో ఇది ఢిల్లీ కి వరుసగ నాలుగవ ఓటమి. నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పోరులో ఢిల్లీ 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. 175 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. మనీశ్ పాండే (50) అర్ధసెంచరీతో అలరించినా, కీలక సమయంలో అవుట్ కావడంతో ఛేజింగ్ లో ఢిల్లీకి ప్రతికూలంగా మారింది. అక్షర్ పటేల్ 21, అమన్ హకీమ్ ఖాన్ 18, నోర్కియా 23 (నాటౌట్) దూకుడుగా ఆడినా, వికెట్లు చేజారడంతో ఢిల్లీ ఢీలాపడింది.

Delhi Capital bags fifth defeat in a row

అంతకుముందు, ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఢిల్లీకి వరుస దెబ్బలు తగిలాయి. రెండు పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పృథ్వీ షా (0), మిచెల్ మార్ష్ (0), యశ్ ధూల్ (1) తీవ్రంగా నిరాశపరిచారు. ఇది జరిగిన కొంతసేపటికి కెప్టెన్ డేవడ్ వార్నర్ (19) కూడా పెవిలియన్ చేరడంతో ఢిల్లీ ఓటమిబాటలో నిలిచింది. బెంగళూరు జట్టులో వైశాఖ్ విజయ్ కుమార్ 3, మహ్మద్ సిరాజ్ 2, వేన్ పార్నెల్ 1, వనిందు హసరంగ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. కాగా, ఈ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇది నాలుగవ ఓటమి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news