ఢిల్లీ లిక్కర్ స్కాం.. అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా !

-

గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియ అతని అనుచరులు ఎంత మేర లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో తేల్చేందుకు సిబిఐ ఎప్పటికప్పుడు విచారణ జరుపుతూ వరుస పిటిషన్లను దాఖలు చేస్తుంది. అయితే తాజాగా ఈ కేసులో నిందితుడు, వ్యాపారవేత్త దినేష్ ఆరోరా అప్రూవర్ గా మారాడు.

ఈ కేసులో దినేష్ అరోరా స్టేట్మెంట్ ని రికార్డ్ చేసింది ధర్మాసనం. ఎవరైనా బెదిరించారా, లేక ఏమైనా ఇబ్బందులకు గురి చేశారా అన్న దానిపై దినేష్ ఆరోరాను అడిగింది సిబిఐ కోర్టు. ఇక ఈ కేసును ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈ కేసు విచారణ చాలా సున్నితమైనదని, మీడియాని కోర్టులోకి అనుమతించవద్దంటూ దినేష్ తరపు న్యాయవాది జస్టిస్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో దినేష్ అరోరా అప్రూవర్ గా మారడంతో అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version