ఢిల్లీ లిక్కర్ స్కామ్ కథ ఏంటి? కవిత ఇరుక్కోవడానికి కారణం ఇదే?

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్..ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలమైన కేసు. అనూహ్యంగా ఇప్పుడు పలువురి అరెస్టులతో సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే కీలక వ్యక్తులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ, విజయసాయిరెడ్డి బంధువు శరత్ చంద్రారెడ్డి..తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవిత సన్నిహితులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. అటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం ఈ కేసులో అరెస్ట్ అయ్యారు.

ఇప్పుడు కే‌సి‌ఆర్ కుమార్తె కవిత వంతు వచ్చింది..ప్రస్తుతం ఆమెని ఈడీ విచారిస్తుంది. ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. సరే అరెస్ట్ గురించి పక్కన పెడితే..ఈ లిక్కర్ స్కామ్ ఏంటి? దీనిలో కవిత పాత్ర ఏంటి? అనేది ఒక్కసారి చూసుకుంటే…ఢిల్లీలో ఇంతవరకు ప్రభుత్వమే లిక్కర్ షాపులని నడిపేది.. ఇక 2021 నవంబరులో ఎక్సైజ్ పాలసీ 2021-22ను అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో మద్యం అమ్మకాల నుంచి ప్రభుత్వం తప్పుకుని.. ఆ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. అయితే ప్రభుత్వంలోని కొందరు ముడుపులు తీసుకొని ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూరేలా మద్యం  పాలసీ తీసుకొచ్చారనేది ఆరోపణ. ఈ విషయాన్ని 2022 జూలైలో కొత్తగా నియమితులైన ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నరేశ్‌ కుమార్‌ వెలుగులోకి తీసుకురాగా, ఈ ఆరోపణలపై నాటి ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ క్రమంలో 2022 ఆగస్టు 19 మనీశ్‌ సిసోడియాతో పాటు పలువురు అధికారులు, ప్రైవేట్‌ వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

kavitha

ఇక ఈ స్కామ్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే మద్యం స్కాంలో కల్వకుంట్ల కవితకు కూడా భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో తెలంగాణకు రాబిన్ డిస్లరీ పేరుతో వ్యాపారం చేసిన రామచంద్ర పిళ్లైకి.. ఢిల్లీ లిక్కర్ స్కాంతో లింకులు ఉన్నట్లు ప్రచారం జరగగా, రాబిన్ డిస్టలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీల్లో పనిచేస్తున్న బోయినపల్లి అశోక్, వ్యాపారవేత్త వెన్నమనేని శ్రీనివాసరావుల పాత్ర ఉన్నట్లు అధికారుల గుర్తిచి..వరుసపెట్టి అరెస్టులు చేసి..కీలక సమాచారాన్ని రాబట్టారు.

అటు అరబిందో గ్రూప్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి బినోయి బాబును ఈడీ అరెస్టుచేసి దశలవారీ విచారణ చేపట్టింది. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవని సైతం అరెస్ట్ చేశారు. అటు ఢిల్లీ డిప్యూటీ సి‌ఎం మనీష్ ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఇదే క్రమంలో రామచంద్రాపిళ్లైని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, కవిత బినామీని అని ఒప్పుకున్నట్లు ఈడీ రిపోర్టు లో ఉంది. అలాగే ఎమ్మెల్సీ కవితకు, మనీష్ మధ్య అవగాహన ఉందని ఈడీ రిపోర్టులో పేర్కొంది. ఇక పిళ్ళై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఇప్పుడు కవితని ఈడీ విచారిస్తుంది. మరి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news