ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే పోలింగ్ కోసం ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 250 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీపార్టీ, బీజేపీ, కాంగ్రెస్ లు పోటీ పడుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. మొత్తం 1,349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. డిసెంబరు 7న… ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నలభై వేల మంది ఢిల్లీ పోలీసులు, 20 వేల మంది హోంగార్డులు, 108 పారా మిలటరీ కంపెనీలను భద్రత కోసం వినయోగించారు.
గత ఎన్నికల్లో బీజేపీ కార్పొరేషన్ ను సొంతం చేసుకుంది. ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. డిసెంబరు 7వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. పోలింగ్ లో భాగంగా ఆదివారం ఉదయం నాలుగున్నర నుంచే మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. గత 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి ఆప్ బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొననుంది.