BREAKING : MLC కవితకు ఢిల్లీ పోలీసులు షాక్

-

ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం ఆమె నిర్వహించతలపెట్టిన ధర్నాస్థలం మార్చుకోవాలని సూచించారు. ధర్నా ప్రాంతంపై బీఆర్ఎస్ ముందుగానే సమాచారం ఇచ్చి అనుమతి పొందిన, చివరి నిమిషంలో ఇలా ఎందుకు జరిగిందనేది తెలియాల్సి ఉంది. దీనిపై మాట్లాడేందుకు ఆమె జంతర్ మంతర్ కు బయల్దేరారు.

 

కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలనే డిమాండ్ తో కవిత రేపు ధర్నా చేయనున్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెట్టి ఆమోదించాలనేది తమ ప్రధాన డిమాండ్‌ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. 27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాటం చేస్తున్నారని.. ఎన్ని ప్రభుత్వాలు మారినా బిల్లుకు మాత్రం ఆమోదం రాలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసమే జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news