ప్రపంచమంతా మద్దతుగా నిలిచినా.. కాంగ్రెస్ సపోర్ట్ సాధించలేకపోయాం : మోడీ

-

ఆపరేషన్ సిందూర్ విషయంలో  ప్రపంచమంతా మద్దతుగా నిలిచినా కాంగ్రెస్ సపోర్ట్ మాత్రం సాధించలేకపోయామని భారత ప్రధాని మోడీ పేర్కొన్నారు. మేడిన్ ఇండియా మిస్సైళ్లు, డ్రోన్లు పాకిస్తాన్ ను చీల్చి చెండాడాయని ప్రధాని లోక్ సభలో పేర్కొన్నారు. ఉగ్రవాద ప్రభుత్వం, ఉగ్రనేతలను వేర్వేరుగా చూడటం లేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచ మంతా మద్దతుగా నిలిచింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయాలు చేస్తోంది. పాకిస్తాన్ కి కేవలం మూడు దేశాలు మాత్రమే సపోర్ట్ చేశాయని వెల్లడించారు.

modi

పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడికి ప్రతిదాడిగా  ఆపరేషన్ సిందూర్ చేపడుతామని పాకిస్తాన్ కలలో కూడా ఊహించలేదు. మన దాడులతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. కాల్పుల విరమణకు పాక్ ప్రాధేయపడింది. ఆపరేషన్ సిందూర్ మన ఎయిర్ ఫోర్స్ 100 శాతం విజయం సాధించిందని ప్రధాని మోడీ తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేయడమే మన లక్ష్యం. మన మిస్సైల్స్ పాకిస్తాన్ లోని మూల మూలకు చొచ్చుకుపోయాయని.. మన సైన్యం సత్తా ఏంటో ప్రపంచం మొత్తం చూసింది. ఊహించని రీతిలో పాక్ ను భారత్ చీల్చి చెండాడింది. ఇక చాలు అంటూ DGMO ల మీటింగ్ లో పాక్ ప్రాధేయపడిందని తెలిపారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news