రేపే ఎస్సై పరీక్ష.. డీజీపీ అంజనీ కుమార్‌ కీలక సూచనలు

-

ఈ నెల 8, 9 తేదీల్లో ఎస్ఐ పోస్టుల‌కు తుది రాత‌ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించేందుకు తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే 8వ తేదీనే ప్ర‌ధాని మోదీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ప‌రీక్ష రాసే ఎస్ఐ అభ్య‌ర్థులు.. ట్రాఫిక్ ఆంక్ష‌ల దృష్ట్యా 2 గంట‌ల ముందే ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకోవాల‌ని రాష్ట్ర డీజీపీ అంజ‌నీ కుమార్ సూచించారు. మోదీ రానున్న నేప‌థ్యంలో సికింద్రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

Telangana DGP orders probe into death of alleged chain snatcher after  'custodial torture' | Cities News,The Indian Express

ఈ ప్ర‌భావం న‌గ‌రం అంత‌టా ప‌డే అవ‌కాశం ఉన్నందున‌.. అభ్య‌ర్థులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే అవ‌కాశం ఉంది. దాదాపు అన్ని ర‌హ‌దారులు బిజీగా ఉండే అవ‌కాశం ఉన్నందున త‌మ ప‌రీక్షా కేంద్రాల‌కు 2 గంట‌ల ముందే వెళ్లేలా అభ్య‌ర్థులు ప్లాన్ చేసుకోవాల‌ని డీజీపీ అంజ‌నీ కుమార్ సూచించారు. ట్రాఫిక్ పోలీసుల‌కు, ఎస్ఐ అభ్య‌ర్థుల‌కు వాహ‌న‌దారులు, ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news