BRSలోకి తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు..రేపు జాయినింగ్ !

-

BRSలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రేపు ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సభలో BRSలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే, దీనిపై ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. తాను ఉద్యోగానికి రాజీనామా చేయడం లేదని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మొద్దన్నారు. ప్రస్తుతం కంటి వెలుగు కార్యక్రమంలో బిజీబిజీగా ఉన్నానని, అనవసరంగా తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news