బాలయ్య Unstoppable షోకు వెళ్లను : రోజా ప్రకటన

-

బాలకృష్ణ Unstoppable షోకు వెళ్లననని కీలక ప్రకటన చేశారు ఏపీ మంత్రి రోజా.  గతంలో రెండు సార్లు పిలిచినప్పుడు వెళ్లడం కుదరలేదని తెలిపారు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ల తర్వాత షో కి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జీవో నెంబర్ 1 గురించి పూర్తిగా చదివితే అర్థమవుతుందన్నారు. ఆయన ఎమర్జెన్సీ అనడం సిగ్గుచేటు అని అన్నారు.

చంద్రబాబు నుంచి బాలకృష్ణ బయటకు రావాలని రోజా పిలుపునిచ్చారు. ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప జీవోలు చదవడం రాదా? అని ప్రశ్నించారు. జీవో నెంబర్ 1 ఎందుకు తెచ్చారో తెలుసుకున్నారా? అని నిలదీశారు. బాలకృష్ణ రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ప్రజల బాగోగులు తెలిసిన వ్యక్తి అని, ఆ జీవో నెంబర్ ఎందుకు తెచ్చామో తెలుసుకుంటే ఎమర్జెన్సీ అనే కామెంట్స్ వెనక్కు తీసుకుంటారని రోజా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news