బాబుకు అధికారం…ధర్మాన లాజిక్ ఏంటి?

-

అధికార వైసీపీలో సీనియర్ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు రాజకీయాలు అసలు క్లారిటీగా ఉండటం లేదు..ఆయన వైసీపీకి మేలు చేసేలా పనిచేస్తున్నారా? లేక పరోక్షంగా వైసీపీని ఇరుకున పెట్టేలా ముందుకెళుతున్నారా? అనేది క్లారిటీ రావడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ తీసుకొచ్చి మూడు రాజధానుల కాన్సెప్ట్‌లో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనేది ఉన్న విషయం విషయం తెలిసిందే.

అయితే పలు న్యాయ పరమైన సమస్యల వల్ల మూడు రాజధానులు ఇంకా అమలు కాలేదు. పైగా వైసీపీ అధికారంలో ఉండి విశాఖ రాజధాని చేయాలంటూ పోరాటాలు చేసింది. ఈ పోరాటంలో ధర్మాన ముందున్నారు. మూడు కాదు అసలు విశాఖనే మెయిన్ రాజధాని అని, ఖచ్చితంగా విశాఖని రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా చెప్పడం వల్ల మిగిలిన ప్రాంతాల ప్రజల్లో అయోమయం ఉంది. వైసీపీ ఎలాగో మూడు రాజధానులు అంటూ ఇతర ప్రాంతాలని కవర్ చేస్తుంది. కానీ ధర్మాన ఏమో విశాఖనే రాజధాని చెప్పి కాస్త ఇరుకున పెట్టారు.

Dharmana a big headache for Jagan? - TeluguBulletin.com

దీని తర్వాత ధర్మాన మళ్ళీ కొత్త డిమాండ్ తెచ్చారు..విశాఖని రాజధానిగా చేయకపోతే ఉత్తరాంధ్రని సెపరేట్ గా రాష్ట్రం చేయాలని, అప్పుడు విశాఖని రాజధానిగా చేసుకుంటామని అన్నారు. దీంతో వైసీపీ శ్రేణులే కన్ఫ్యూజ్ అయ్యాయి. ఇక తాజాగా చంద్రబాబు అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తారని, దాని పై తమకు అభ్యంతరం లేదని, కానీ ఉత్తరాంధ్రని ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేశారు.

అంటే ఇక్కడ ధర్మాన లాజిక్ అసలు అర్ధం కాకుండా ఉంది..చంద్రబాబు అధికారంలోకి వస్తారని ధర్మాన భావిస్తున్నారా? అలాగే సెపరేట్ రాష్ట్రం అని చెప్పి వైసీపీనే ఇరుకున పెడుతున్నారు. మొత్తానికి ధర్మాన పరోక్షంగా వైసీపీకే నష్టం చేస్తున్నారా? అనే భావన కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news