ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని వెల్లడించారు మంత్రి ధర్మాన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పుల పాయలో రాజధాని పెట్టాలని చెప్పలేదని విశాఖపట్నంలో పరిపాలన రాజధాని పెడితే తెలుగుదేశం పార్టీకి అభ్యంతరం ఏంటని ఆయన నిలదీశారు. ఆదివారం రాత్రి మీడియాతో ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆశపడి కుట్రలు చేస్తున్నారని విశాలమైన ప్రజల ప్రయోజనాలు ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని వెల్లడించారు. విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్రలో ధర్మాన ప్రసాదరావు నాయకుడు అయిపోతాడు అనే ఆలోచనలు చేయవద్దని వెల్లడించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తాను అసలు పోటీనే చేయకూడదని భావిస్తున్నారని సంచలన ప్రకటన చేశారు ధర్మాన ప్రసాదరావు. ఉత్తరాంధ్ర నేతలు ఎవరికి వారు ముందుకొచ్చి పోరాటం చేయాలని సూచనలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల పోరాటంతో పోలిస్తే తనకు మంత్రి పదవి గొప్ప కాదని వివరించారు. ప్రభుత్వం వికేంద్రీకరణకు మద్దతు ఇస్తోందని అందరూ కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ధర్మన ప్రసాదరావు పేర్కొన్నారు.