కలెక్టర్ సారూ..మీరు చేసిన పనికి ఫిధా అవ్వాల్సిందే..!!

-

మనం పుట్టిన ఊరు మనకు చాలా ఇచ్చింది..మనం ఎంతోకొంత తిరిగి ఇవ్వాలి లేకుంటే లావు అవుతారు అని మహేష్ బాబు సినిమాలో ఓ డైలాగు ఉంది.. అది నిజమే..మనకు అన్నీ ఇచ్చిన పాఠశాలకు కొంత ఇవ్వాలి అని ఓ కలెక్టర్ వినూత్న ఆలోచన చేశాడు.ఇప్పుడు ఆలోచన ఎందరో విద్యార్థులకు ఆసరాగా నిలిచింది..ఇప్పుడు అతను కలెక్టర్ గానే కాదు అందరి దృష్టిలో హీరో అయ్యాడు..అతని గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం…

జెడ్పీ హైస్కూల్‌… ఎస్‌.కోట మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాల. గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరిన ఆ విద్యాలయం ఇప్పుడు ఆధునికీకరణకు అద్దం పడుతోంది. ధర్మవరం జెడ్పీ హైస్కూల్‌ స్టూడెంట్‌నని అక్కడి విద్యార్థులు ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. దానికి రెండు కారణాలు… ఒకటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు. మరొకటి అక్కడి పూర్వ విద్యార్థి, పల్నాడు జిల్లా కలెక్టరు లోతేటి శివశంకర్‌ కృషి. విద్యాబుద్ధులు నేర్పడమే గాక తాను ఐఏఎస్‌ అధికారి కావాలనే లక్ష్యానికి బీజం వేసిన పాఠశాలకు గురుదక్షిణ సమర్పించిన తీరు అందరిని కట్టిపడేసింది.

సొంతంగా రూ.8.5 లక్షలు ఖర్చు చేసి డిజిటల్‌ లైబ్రరీని ప్రారంభించారు.డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేయడానికి పాఠశాల ప్రాంగణంలోనే ఒక హాల్‌ను శివశంకర్‌ ఎంపిక చేశారు. తన తండ్రి లోతేటి సన్యాసప్పడు పేరుతో రూ.8.5 లక్షల విరాళంగా సమకూర్చారు. ఆ నిధులతో చక్కని మార్చుల్స్, సీలింగ్, గోడలకు పుట్టీ, పెయింటింగ్‌తో ఆహ్లాదంగా ఆ హాల్‌ను అభివృద్ధి చేశారు. ఏసీ సౌకర్యంతో పాటు స్టడీ టేబుళ్లు, కుషన్‌ కుర్చీలు సమకూర్చారు. రెండు కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు సీసీ కెమెరాలతో రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇక పుస్తకాలను సమకూర్చడంలో శివశంకర్‌ తన వంతు కృషి చేశారు..దసరా సెలవుల్లో బాహుదా సేవాసంఘం సభ్యులు వారికి పోటీ పరీక్ష నిర్వహించనున్నారు. అందులో అత్యుత్తమ ప్రతిభ చూపిన తొలి 20 మంది విద్యార్థులను ఐదు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో విజ్ఞాన యాత్రకు తీసుకెళ్తానని శివశంకర్‌ హామీ కూడా ఇచ్చారు..అతను చేసిన పనికి ఆ ఊరి జనం ఫిదా అయ్యారు.ఎవరికీ ఏ కష్టం వచ్చినా కూడా లేదనకుండా సాయాన్ని అందిస్తూ రియల్ హీరో అయ్యాడు..

Read more RELATED
Recommended to you

Exit mobile version