తెలంగాణ‌లో త‌గ్గిన కరోనా.. నేడు 49 కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుంది. ప్ర‌తి రోజు కింద‌టి రోజు తో పోలిస్తే.. కేసుల సంఖ్య త‌గ్గుతూనే ఉంది. కాగ ఈ రోజు కూడా క‌రోనా కేసులు నిన్న‌టితో పోలిస్తే కొంత వ‌ర‌కు త‌గ్గాయి. అయితే నేటి క‌రోనా వైర‌స్ బులిటెన్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కేవ‌లం 49 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు మాత్ర‌మే వెలుగు చూశాయి.

corona cases | కరోనా కేసులు
corona cases | కరోనా కేసులు

అయితే బుధ‌వారం రాష్ట్రంలో 72 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అంటే నిన్న‌టితో పోలిస్తే.. ఈ రోజు రాష్ట్రంలో 23 కేసులు త‌గ్గాయి. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 7,91,038 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కాగ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 67 మంది క‌రోనా వైర‌స్ బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 619 యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి. కాగ గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 20,444 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news