మధుమేహం ఉన్నవారు..వెల్లుల్లిని రెగ్యులర్‌గా తీసుకోవచ్చా..?

-

మధుమేహం రావడానికి కారణాలు చాలా ఉంటాయి. అందులో ప్రధానంగా ఉండేవి శారీరక శ్రమ లోపం, ఎక్కువసేపు ఒకే దగ్గర కదలకుండా కుర్చోవడం, ఏదిపడితే అది తినేయటం, ఇలాంటి వాటివల్ల ఊబకాయంతో పాటు బోనస్‌గా డయబెటీస్‌ కూడా వస్తుంది. జబ్బులు రెండైనా జాగ్రత్తలు ఒకటే..ఊబకాయం తగ్గించారంటే..డయబెటీస్‌ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.
స్టెరాయిడ్స్, కొన్ని రకాల వైరస్, ఇన్ఫెక్షన్స్, హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం వస్తుంటుంది. తరచుగా మూత్ర విసర్జన (పాలీయూరియా), పొడి గొంతు లేదా తరచుగా దాహం వెయ్యడం, కంటి చూపు మందగించడం., కారణం లేకుండా ఆకస్మిక బరువు పెరుగుట లేదా బరువు తగ్గడం ఒక్కసారిగా నీరసం అలసటగా అనిపించడం అధికంగా ఆకలి వేయడం ఇవన్నీ జరుగుతుంటే అస్సలు అశ్రద్ద చేయకండి. ఎందుకంటే ఇవి డయబెటిక్‌ లక్షణాలు కాబట్టి.

గర్భవతుల్లో వచ్చే డయబెటీస్‌ ప్రమాదకరమా..?

గర్భవతుల్లో 2 నుంచి 5 శాతం వరకు ఈ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఈ డయాబెటిస్‌కు సరిగా వైద్యం అందించకపోతే తల్లీ, బిడ్డలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రసవం తర్వాత కూడా డయాబెటిస్ ఉండవచ్చు.

వాకింక్‌ చేస్తే నిజంగా మధుమేహం మాటవింటుందా..?

వాకింగ్ చేస్తే డయాబెటిస్​ అదుపులో పెట్టవచ్చని వైద్యులు చెప్తుంటారు… రాత్రిపూట భోజనం తర్వాత వాకింగ్ చేసిన వారిలో ఏకంగా 22 శాతం వరకు షుగర్ లెవెల్స్ తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది. ఇలా వాకింగ్ చేస్తే అస్సలు మధుమేహం సమస్య దరిచేరదట.. శరీరానికి మానసిక, శారీరక ఉల్లాసం అందుతుంది..వారి పనితీరు సైతం మెరుగైనట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

వెల్లుల్లితో ఉపశమనం…

వెల్లుల్లితో మధుమేహం నుంచి ఉపశమనం పొందవచ్చు. వెల్లుల్లిలో ఔషధ గుణాలు ఎక్కువ. ఇక వెల్లుల్లి వేసిన వంటలు చక్కని రుచి, వాసనను ఎలాగూ అందిస్తాయి. శరీరంలోని ఇంకా వ్యాధులకు (Diseases) చెక్ పెట్టే శక్తి వెల్లుల్లికి ఉంది. మనం తినే ఆహారం మన శరీరంలో షుగర్ లెవెల్స్ పెంచుతోంది. దానికి విరుగుడు వెల్లుల్లి. ఇది షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది.
వెల్లుల్లి ఏడు వారాల్లో సెరమ్ గ్లూకోజ్‌ని 57 శాతానికి తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. అంటే నెలన్నరలోనే టైప్-2 డయాబెటిస్ సమస్యల నుంచీ గట్టెక్కవచ్చు. అందువల్ల షుగర్ వ్యాధి ఉన్నవారు ఉదయాన్నే వెల్లుల్లి తింటే అద్భుత ఫలితాలు కనిపిస్తాయని పరిశోధకులు అంటున్నారు. ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి రసం తాగవచ్చు. ఇలా కూడా చేయలేం అనుకునేవారు వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకొని వాటిని కాల్చి తినవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులకు వెల్లుల్లి దివ్యౌషధం. కాబట్టి కష్టమైనా కాస్త ఇష్టంగా తినేందుకు ట్రే చేయండి.!
పైన పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే..ఆరోగ్యపరమైన సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించగలరు.

Read more RELATED
Recommended to you

Latest news