ప్రియాంక గాంధీ అనే ఓ రాజకీయ వారసురాలు, అఖిలేశ్ యాదవ్ అనే మరో రాజకీయ వారసుడితో తలపడుతున్నారు. ప్రియాంక గాంధీ అనే రాజకీయ వారసురాలు నేటి నుంచి ఏ విధంగా మిగిలిన పార్టీలను ప్రభావితం చేయనున్నారు అనే అంశంపై రాజకీయ పండితులు తర్జన భర్జనలు పడుతున్నారు.
నేను ఆడపిల్లనే కానీ పోరాడగలను పోరాడతాను అని ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడుతున్న ప్రియాంక గాంధీ రాక కారణంగా కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.ఎవ్వరూ ఊహించనంత మంచి ఫలితాలు అందుకుంటుందో లేదో కానీ విడ్డూరం అయిన రీతిలో ప్రియాంక మాత్రం కొన్ని పనులు చేశారు.అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా చేశారు.ఆ విధంగా ఈ ఇద్దరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జవం మరియు జీవం నింపే క్రమంలో ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ఆరో విడత పోలింగ్.. నేటి రోజు (మార్చి 3,2022) దాటిపోతే మరో రోజు (మార్చి 7,2022) ఉంటుంది.. ఇదే ఆఖరు విడత పోలింగ్ కు సంబంధించిన తారీఖు.అంటే రెండు విడతల్లో పోలింగు అన్నది ఇప్పటి దాకా ఉన్న బాకీ.ఇవాళ ఆరో విడతకు సంబంధించి సన్నాహాలు పూర్తయ్యాయి.ఇక మిగిలింది ఒక్క విడతనే! ఇవన్నీ పూర్తయ్యాకే ఎన్నికల ఫలితాలు తేలాక ప్రియాంక ప్రభావం ఎంతన్నది రాహుల్ రాజకీయం ఏంటన్నది ఒక్కసారిగా లెక్కలతో సహా స్పష్టం కానుంది.వాస్తవానికి ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్య లాంటిది.ఎందుకంటే అస్సలు ఉనికిలో లేని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలతో అయినా పరువు నిలుపుకోవాలని చూస్తోంది.
ఒకప్పుడు దళితులు,మైనార్టీలు అంతా కాంగ్రెస్ వైపే ఉండేవారు. ప్రధానంగా బ్రాహ్మణ సామాజికవర్గంను ప్రభావితం చేయడంలో అప్పుడూ ఇప్పుడూ ప్రధాన పార్టీలు బాగానే పోటీపడ్డాయి.ఈ పోటీలో విజేత ఎవరు అన్నది అటుంచితే కాంగ్రెస్ పార్టీ తన తీరును ఈ ఎన్నికలకు అనుగుణంగా మార్చుకుని ఫక్తు రాజకీయ పార్టీ ధోరణినే ప్రదర్శించి సంబంధిత సూత్రాలను అమలు చేసింది.అంతేకాదు అఖిలేశ్ కూడా బీజేపీ దారిలోనే వెళ్లారు.ఆ విధంగా మూడు పార్టీలూ హిందుత్వ కార్డును బాగానే వాడుకున్నాయి.అందరూ అదే నామ జపం చేయడం వల్ల ఉపయోగం లేకపోయినా మీడియాలో మాత్రం అందరూ ప్రధాన ఆకర్షణగానే నిలిచారు.
ఆ విధంగా బీజేపీ వినిపించిన నినాదం ఇటు కాంగ్రెస్ కు అటు ఎస్పీకీ బాగానే ఉపయోగపడింది.ఇక ఆఖరుగా విజేత తేలేటప్పుడు ఎవరు ఎక్కువగా ఓటర్లను ఆకట్టుకున్నారు అన్నదే కీలకం.ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో మిగిలిన ప్రధాన పార్టీల కన్నా కాంగ్రెస్ మాత్రమే ముందుంటుంది చెప్పారు ప్రియాంక.ఇదొక్కటి బీజేపీకి భిన్నంగా ఉంది.అదేవిధంగా రైతు రుణ మాఫీ విషయం కూడా కొన్ని పార్టీలు తెరపైకి తెచ్చాయి. ఉచిత విద్యుత్ పై కూడా బీజేపీ గొంతు బాగానే వినిపించింది.ఇవి రేపటి వేళ ఏ విధం అయిన ప్రభావం చూపిస్తాయో అన్నది ఆసక్తిదాయకం.