సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో ఎవరు చెప్పలేము. ఒక్కోసారి ఓవర్నైట్ లోని కొంతమంది నటీనటులు మంచి పాపులారిటీ సంపాదిస్తు ఉంటారు. కొంత మంది నటీనటులు మాత్రం ఎన్ని సినిమాలు తీసిన స్టార్ డమ్ అనేది రాకుండా ఉంటుంది. ఇక డైరెక్టర్ ల విషయానికి వస్తే వారు ఒక హీరోతో సినిమా అనుకొని చివరికి మరో హీరోతో చేయవలసి వస్తూ ఉంటుంది. ఇలాంటి మార్పు అనేది ఏ ఇండస్ట్రీలో నైనా సహజం గానే జరుగుతూ ఉంటుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాకి ముందుగా పవన్ కళ్యాణ్ తో తీయాలి అనుకోలేదట డైరెక్టర్ .ఈ సినిమా కోసం ముందుగా పలువురు స్టార్ హీరోల కలిసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
భీమ్లా నాయక్ సినిమా మలయాళం నుంచి రీమిక్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాని ముందుగా రానా మరియు వెంకటేష్ లతో తెరకెక్కించాలని భావించారట. కానీ వీరి కాంబినేషన్ సెట్ కాకపోవడంతో.. బాలకృష్ణ ,రవితేజ కాంబినేషన్ లో తీయాలనే ఆలోచన చేశారు నాగ వంశీ. కానీ వీరి కాంబినేషన్లో కూడా పలు కారణాల వల్ల నిలిచిపోయింది.
అయితే ఒకరోజు డైరెక్టర్ నాగ వంశీ సోషల్ మీడియాలో అయ్యప్పన్ కోషియమ్ మూవీను చూసి త్రివిక్రమ్ కు కాల్ చేసి సినిమా చేద్దామా అని అడిగారట. దీంతో త్రివిక్రమ్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ను తీసుకోవాలని తెలియజేశారట. అయితే పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేస్తే విజయవంతం అవుతుందని తెలియజేశారట. దాంతో విరు పవన్ కళ్యాణ్ కు స్క్రిప్ట్ చెప్పగానే సినిమాను ఓకే చేశారట. ఇక మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నప్పుడు రవితేజ అనుకోగా రవితేజ డేట్లు ఖాళీగా కాకపోవడంతో రానాని తీసుకున్నట్లుగా తెలియజేశారు. దీంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.