వాహనదారులకు హెచ్చరిక.. పన్ను బకాయిలు చెల్లించారా?

-

తెలంగాణ రవాణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పన్ను బకాయిలు చెల్లించకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. పన్ను బకాయిలను చెల్లించని వాహనాలను గుర్తించి.. బకాయిలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వాహన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలకు రోడ్డుపై ఎక్కితే.. మూడు వందల రెట్లు అధికంగా జరిమానా విధించనుంది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పేర్కొంది.

పోలీసులు-వాహన తనిఖీ
పోలీసులు-వాహన తనిఖీ

అయితే, ఇప్పటివరకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ మీదే దృష్టి సారించారు. కానీ, సరైన పత్రాలు లేని వాహనాలపై కేర్ తీసుకోలేదు. దీంతో ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలు, బకాయిలు ఎక్కువగా ఉన్న వాహనాల సంఖ్య అధికమైంది. పన్నులు కట్టని వారి సంఖ్య ఎక్కువైంది. తద్వారా భారీగా బకాయిలు పేరుకుపోయాయి. దీంతో బకాయిల వసూళ్లపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సరైన పత్రాలు లేని వాహనదారులపై మూడు వందల రెట్లు అధికంగా జరిమానా చెల్లించాలని రవాణా శాఖ ప్రకటన జారీ చేసింది. ఈ విషయంపై వాహనదారులకు అవగాహన కూడా కల్పించాలని పేర్కొంది. కాగా, ఆటోలు, ట్రాక్టర్లకు ప్రభుత్వం రోడ్డు పన్ను రద్దు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news