సక్సెస్ ఫుల్ కాంబో రిపీట్..ఆ దర్శకుడితో అక్కినేని వారి హీరో మరో సినిమా

-

జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో ఒకసారి కుదిరిన కాంబినేషన్ హిట్ అయితే చాలు.. వారి కాంబోలో మరో సినిమా ఎప్పుడొస్తుందా? అని అభిమానులు చర్చించుకుంటారు. అలా కాంబోలో సినిమా రావాలని కోరుకుంటారు కూడా. అలా అక్కినేని వారి యంగ్ హీరోకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ ‘బొమ్మరిల్లు’ భాస్కర్. చాలా కాలం నుంచి హీరోగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ ఫిల్మ్ తో సక్సెస్ ఇచ్చాడు భాస్కర్.

అఖిల్ ప్రస్తుతం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నారు. కాగా, ఈ సినిమా పూర్తయిన తర్వాత అఖిల్ మరోసారి బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమాచేయబోతున్నట్లు సమాచారం. ‘ఏజెంట్’ పిక్చర్ షూటింగ్ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో నెక్స్ట్ ఫిల్మ్ కోసం అఖిల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ – సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.

అఖిల్ తో మరో సినిమా కోసం బొమ్మరిల్లు భాస్కర్ ఆల్రెడీ స్టోరి రెడీ చేసుకున్నారట. ఇక ఆల్రెడీ సక్సెస్ అయిన కాంబినేషన్ కాబట్టి అఖిల్ సైతం మరోసారి బొమ్మరిల్లు భాస్కర్ తో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు టాక్. త్వరలో వీరి కాంబో సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news