వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి దీపావళికి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.
హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. దీపావళి నాడు మంచి జరగాలని.. చెడు దూరం అయిపోవాలని అందరూ పండుగను జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది పండుగ ఎప్పుడు వచ్చింది అనేది చూస్తే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వచ్చింది. అయితే దీపావళికి ఇలా మార్పులు చేస్తే మంచిదని.. దాని వలన లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది అని అన్నారు. మరి దాని కోసమే చూద్దాం.
దీపావళి నాడు పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఇలా ఫాలో అవ్వండి .దీపావళి వచ్చేస్తుంది కాబట్టి చాలామంది దీపావళి కి సంబంధించిన ప్రిపరేషన్స్ ని మొదలు పెట్టే ఉంటారు అయితే ఈ చిట్కాలు మాత్రం తప్పనిసరిగా ఫాలో అవ్వండి.
గోడల్ని ఎంతో అందంగా ఉంచుకోండి దీనివల్ల అందమే కాదు ప్రశాంతంగా కూడా ఉంటుంది.
అలానే ఇంట్లో గంటలు కట్టడంవల్ల మంచి పాజిటివ్ ఎనర్జీని ఇవి తీసుకు వస్తాయి. చక్కగా మంచి ఆహ్లాదకరమైన శబ్దం వచ్చే గంటలను ఉపయోగించండి.
దీపావళినాడు గంటల తో డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుంది పైగా పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది.
అలానే దీపాలను వెలిగిస్తే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఇది కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది.
పూలు కూడా మంచి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి.
శుభ్రంగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుని దీపావళికి ఇంటిని అలంకరించుకుని లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందండి పాజిటివ్ ఎనర్జీ ఉంటే లక్ష్మీదేవి కూడా ఉంటుంది.