డిజిటల్ ఇండియా.. డిజిటల్ పేమెంట్స్.. డబ్బులు డ్రా చేయాలన్నా.. ఎవరికైనా పంపాలన్నా.. క్షణాల్లో అయిపోతుంది.. బ్రూ ప్యాకెట్ నుంచి..బంగారం వరకూ ఏది కొన్నా ఆన్‌లైన్‌లోనే పేమెంట్స్ చేసేయొచ్చు. అయితే.. కొన్నిసార్లు తెలియకుండా పొరపాటున ఒకరికి పంపాల్సిన మనీ వేరే వాళ్లకు పంపుతాం.. అలాంటి టైమ్‌లో తప్పు తెలుసుకుని ఆ నెంబర్‌కు కాల్ చేసినా.. కొందరు రెస్పాండ్ కారు. అలా కాకుండా.. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయడంలో ఏదైన తప్పు జరిగి వేరే వాళ్లకు పంపితే.. అప్పుడు మన డబ్బు అస్సామేనా ఇక..!ఇలా పొరపాటున వేరే వాళ్ల అకౌంట్‌కు మనీ పంపితే ఏం చేయాలి..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం.. డిజిటల్ సేవల ద్వారా అనుకోకుండా, పొరపాటుగా ఏవైనా లావాదేవీలు జరిపితే బాధిత వ్యక్తి మొదట ఏ యాప్ ఉపయోగించి ట్రాన్సాక్షన్ చేస్తారో, వారికి ఫిర్యాదు చేయాలి. అంటే గూగుల్ పే ద్వారా ఒకరికి డబ్బులు పంపబోయి పొరపాటున మరొకరికి మనీ ట్రాన్స్‌ఫర్ చేశారు అనుకుందాం.. మొదట గూగుల్ పేకు ఫిర్యాదు చేయాలి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పోర్టల్‌లో కూడా కంప్లైంట్ చేయాలి. మనీ ట్రాన్స్‌ఫర్‌తో పాటు మర్చంట్ ట్రాన్సాక్షన్స్‌కి కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఎలా కంప్లైంట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం..
ముందుగా https://www.npci.org.in/ పోర్టల్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో టాప్ రైట్‌లో Get in Touch పైన క్లిక్ చేసి UPI Complaint పైన క్లిక్ చేయండి..
ఆ తర్వాత Complaint సెక్షన్‌లో Transaction పైన క్లిక్ చేయండి..
Person to Person లేదా Person to Merchant లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Incorrectly transferred to another account ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇతర వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఇలా కంప్లైంట్ చేసిన తర్వాత మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ కంప్లైంట్స్ ద్వారా ఫలితం లేకపోతే అప్పుడు డైరెక్టుగా బ్యాంకును సంప్రదించండి.. ఇదంతా ఎందుకు ముందే మేం బ్యాంకును సంప్రదిస్తాం అన్నా పర్వాలేదు. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ లేదా అంబుడ్స్‌మన్ ఫర్ డిజిటల్ కంప్లైంట్స్‌లో కంప్లైంట్ చేయొచ్చు. ఏది ఏమైనా తెలియని వ్యక్తులకు మనీ పంపేముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోని పంపడం ఉత్తమం.. మన డబ్బు ఒకసారి చేయిదాటిందంటే.. మళ్లీ రావడం కష్టమే.. ఈ ప్రొసీజర్ అంతా ఉన్నా..టైమ్ వేస్ట్ ప్రాసెస్ కదా..!