మర్యాదల్లో గోదారోల్లు తగ్గేదేలే..379 రకాల వంటకాలతో కొత్త అల్లుడికి విందు..

-

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాతి సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అందులో గోదావరి జిల్లాల్లో పండుగ గురించి చెప్పాలంటే మాటలు చాలవు ఆయ్..బయట వాళ్ళు ఇంటికి వస్తే మర్యాదల తో చంపేస్తారు..ఇక కొత్త అల్లుడు ఇంటికి వస్తే ఎలా ఉంటుంది ఊహించండి.. అయ్య బాబోయ్..అదన్నమాట..మొన్న ఓ దంప‌తులు 173 వంట‌కాలు సిద్దం చేయ‌గా.. ఇప్పుడు ఇంకొక‌రు ఏకంగా 379 వంట‌కాలు కొత్త అల్లుడి కోసం సిద్దం చేసి ఔరా అనిపించారు. డైనింగ్ టేబుల్ నిండా ఎక్క‌డా చిన్న ఖాళీ లేకుండా వంట‌కాల‌తో నింపేశారు.

ఆ వంట‌కాల‌ను చూసి అదేదో సినిమాలో బ్ర‌హ్మ‌నందం చెప్పిన‌ట్లుగా ఇంత ఎవ‌రైనా తింటారా సార్‌.. మీరు కూడా తిన‌లేరు అనే డైలాగ్ చెప్పే ప‌రిస్థితిలా త‌యారైంది ఆ కొత్త అల్లుడి ప‌రిస్థితి. ఏలూరు నగరం దొంగల మండపానికి చెందిన భీమారావు, చంద్రలీల దంపతులు త‌మ‌ కుమార్తెను అన‌కాప‌ల్లికి చెందిన ముర‌ళీకి ఇచ్చి గతేడాది ఏప్రిల్‌లో వివాహం జ‌రిపించారు. వీరి వివాహం త‌రువాత తొలి సంక్రాంతి కావ‌డంతో అల్లుడు, కూతురు ఇంటికి రావ‌డంతో వారు జీవితంలో మ‌రిచిపోలేని విధంగా ఏర్పాట్లు చేయాల‌ని బావించారు.

అయితే, అన్నీ అనుకున్న‌ట్లుగానే పిండివంటలు, కూరలు, వేపుళ్లు, స్వీట్లు, పండ్లు, కూల్ డ్రింక్స్, పచ్చళ్లు ఇలా 379 రకాల వంటకాలను కొత్త అల్లుడి కోసం సిద్దం చేశారు.ఆ వంటకాలను డైనింగ్ టేబుల్ పై పెట్టి అల్లుడు, కూతురిని భోజ‌నానికి పిలిచారు. ఇంకేముంది అన్ని వంట‌కాల‌ను ఒకేసారి చూసి ఆ అల్లుడు షాకైయ్యాడు. కూతురు, అల్లుడికి ఆ దంప‌తులు ఇద్ద‌రూ క‌లిసి కొస‌రి కొస‌రి తినిపించారు..ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..ఇక వచ్చే ఏడాది ఎవరు ఎన్ని వంటలు చేస్తారో అని ఆసక్తి కనబరుస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news