దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం: సిర్పూర్కర్ కమీషన్

-

దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఇచ్చింది. మొత్తం 387 పేజీలతో సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. నిందితులను కావాలనే ఎన్కౌంటర్ చేశారని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. పోలీసులు గాయపడి ఆసుపత్రిలో చేరడం కట్టుకథ అని, నిందితుల్లో ముగ్గురు మైనర్లు అన్న విషయాన్ని కూడా దాచారని సిర్పూర్కర్ కమీషన్ నివేదిక తేల్చింది.

ఈ కేసుపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హాజరయ్యారు. విచారణ అనంతరం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశ ఎన్ కౌంటర్ కేసులో సుప్రీం కోర్టు ప్రత్యేకంగా మానిటర్ చేయలేదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసును రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది. చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సీజేఐ ఎన్.వి.రమణ ధర్మాసనం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news