తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఆ రోజుల్లో ఫ్రీ..

-

మే నెలలో విద్యార్థులు చాలా బిజిగా ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఎగ్జామ్స్ తో కుస్తీ పడుతున్నారు..ఇప్పటికే పలు పరీక్షలు పూర్తీ కాగా, ఇప్పుడు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది..ఈ నెల 23 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థులకు ఫ్రీ బస్ సర్వీసును అందించనున్నట్లు అదికారికంగా ప్రకటించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎగ్జామ్ సెంటర్ల వరకు విద్యార్థులను దించి, అనంతరం పరీక్షలు అయ్యాక మళ్ళీ తీసుకొని వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.సరికొత్త నిర్ణయాలతో సంస్థలో వినూత్న మార్పులు తీసుకువస్తున్నారు. మదర్స్ డే, చిల్డ్రన్స్ డే లాంటి ప్రత్యేక దినాల్లో ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చి సంస్థను ప్రయాణికులకు అన్ని విధాల దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.పండుగల సంమయంలోనూ ప్రముఖ పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపి భక్తుల అభిమానాన్ని అందుకుంటున్నారు.

సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ప్రయాణికుల నుంచి అందే వినతులు ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న బస్ పాస్ టైం ను జూన్ 1 వ తెదీ వరకూ పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జామ్స్ కు వెళ్ళే విద్యార్థులు తమ బస్ పాస్ తో ఎగ్జామ్ హాల్ టిక్కెట్ల ను చూపించాలని ట్వీట్ లో పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని పదో తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉన్న అంత వరకూ ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news