ప్రభాస్‌తో మారుతి మూవీ..క్లారిటీనిచ్చిన డైరెక్టర్

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి..‘రాజా డీలక్స్’ అనే టైటిల్ తో సినిమా తీయబోతున్నారని కొంత కాలం నుంచి వార్తలొస్తున్నాయి. ఈ సినిమా విషయమై ప్రభాస్ తో చర్చలు జరుగుతున్నాయని టాక్ వచ్చింది. కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రమోషన్స్ లో ఈ వార్తలన్నిటికీ చెక్ పెడుతూ..క్లారిటీ ఇచ్చారు దర్శకుడు మారుతి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా విషయమై చర్చలు సాగుతున్నాయని దర్శకుడు మారుతి తెలిపారు. తాను ప్రభాస్ అభిమానినని, తనతో ‘బుజ్జిగాడు’, ‘డార్లింగ్’ లాంటి ఎంటర్ టైన్మెంట్ ఫిల్మ్ తీయాలని ప్లాన్ చేస్తున్నానని వివరించారు. ఫుల్ యాక్టివ్ గా ఉండే ప్రభాస్ ను తన సినిమాలో చూపించాలని భావిస్తున్నట్టు చెప్పారు.

ఈ సినిమా టైటిల్ ‘రాజా డీలక్స్’ అని, నేపథ్యం, హీరో హీరోయిన్స్ గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టతనిచ్చారు. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా, హీరోయిన్ గా రాశీ ఖన్నా నటించిన ‘పక్కా కమర్షియల్’ ఫిల్మ్ వచ్చే నెల 1న విడుదల కానుంది. ప్రభాస్ తో సినిమా గురించి చర్చలు మాత్రమే జరుగుతున్నాయని, ఓకే అయితే వివరాలన్నీ త్వరలో వెల్లడిస్తామని దర్శకుడు మారుతి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news