వాట్సప్ సేవలకు అంతరాయం..ఈ టెక్నికల్‌ సమస్యతో ఎన్ని కోట్ల నష్టమో తెలుసా ?

-

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వాట్సాప్ సేవలు ఆగిపోయాయి. చాలామంది యూజర్లు వాట్సాప్ గ్రూపులో మెసేజ్ లు చేయలేకపోతున్నారు. పర్సనల్ గా మెసేజ్ లు వెళ్తున్న సింగిల్ టిక్ మాత్రమే వస్తుండడంతో ఏం జరుగుతుందో తెలియక యూజర్లు అయోమయానికి గురవుతున్నారు. కొందరికి పర్సనల్ మెసేజ్ లు వెళ్లడం లేదు.

ఇలా దాదాపు 1 గంట వరకు ఈ సమస్య ఇండియన్స్‌ కు తలెత్తింది. ఒక గంట తర్వాత.. వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. దీంతో వినియోగ దారులు అంతా.. ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఈ వాట్సాప్ సేవల అంతరాయం కారణంగా.. ఆ సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. 5 నిమిషాలకు ఒక కోటి రూపాయల వరకు పోయిందని వార్తలు వస్తున్నాయి. ఓవరాల్‌ గా చూస్తే… 19.12 బిలియన్స్‌ వాట్సప్‌ కు నష్టం జరిగినట్లు సమాచారం అందుతోంది. ఇదే.. విషయంపై సోషల్‌ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news