కెసిఆర్ పరిస్థితి బీడీ బిచ్చం – కల్లు ఉద్దెర అన్నట్లుగా తయారైంది – వైఎస్ షర్మిల

-

సీఎం కేసీఆర్ పరిస్థితి బీడీ బిచ్చం, కల్లు వద్దురా అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు 189 వ రోజు నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలం కనకపూర్ గ్రామంలోకి చేరుకుంది. గ్రామస్తులు వైయస్ షర్మిలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. 4 లక్షల కోట్ల అప్పు తెచ్చినా సంక్షేమ పథకాల అమలుకు నిధులు లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని వ్యాఖ్యానించారు.ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కెసిఆర్ ఫాంహౌస్ నుండి బయటకు వస్తారని మండిపడ్డారు. తెచ్చిన అప్పులను కాలేశ్వరం ప్రాజెక్టు రూపంలో కేసీఆర్ తినేశారని ఆరోపించారు. బంగారు తెలంగాణ చేస్తానని, ఉద్యోగాలు కల్పిస్తానని, నీటి కొరత లేకుండా చేస్తానని, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ సహ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news